14.6 C
New York
Friday, May 29, 2020
Home Uncategorized అంతుచిక్కని వైరస్.. హైదరాబాద్‌లో కొత్త ఏరియాల్లో వ్యాప్తి

అంతుచిక్కని వైరస్.. హైదరాబాద్‌లో కొత్త ఏరియాల్లో వ్యాప్తి

అంతుచిక్కని వైరస్.. హైదరాబాద్‌లో కొత్త ఏరియాల్లో వ్యాప్తి

ఆందోళనలో అధికార యంత్రాంగం

ఓ వైపు తొలగింపు.. మరో వైపు ఏర్పాటు

కట్టడి ప్రాంతాల తీరిది

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): నగరంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. నాలుగైదు రోజులుగా నమోదవుతున్న కేసులు తక్కువే ఉంటున్నప్పటికీ.. కొత్త ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇన్నాళ్లు మర్కజ్‌ మూలాలు, వారితో సన్నిహితంగా ఉన్న వారిలోనే వైరస్‌ సోకినట్టు గుర్తించారు. ఇటీవలి కాలంలో వారెవరితో సంబంధం లేని వారిలోనూ కరోనా ఉన్నట్టు నిర్ధారణ అవుతోంది. తాజాగా రామంతాపూర్‌లో ఓ కిరాణా దుకాణం యజమానికి వైరస్‌ సోకినట్టు పరీక్షల్లో తేలింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, ఆ దుకాణంలో సరుకులు కొనుగోలు చేసిన వారిని క్వారంటైన్‌ చేశారు. ఇదే ఏరియాలోని నవరంగ్‌గూడలో ఓ కేసు నమోదైంది. దీంతో ఆ ఏరియాను కట్టడి ప్రాంతంగా గుర్తించారు. 14 రోజుల పాటు కొత్త కేసులు నమోదు కాని ప్రాంతాల్లో కట్టడి తొలగిస్తుండగా.. కొత్త ఏరియాల్లో కట్టడి ఏర్పాటు చేయాల్సి వస్తోంది.

బోడుప్పల్‌లో కిరాణ వ్యాపారికి కరోనా ఉన్నట్టు తేలింది. బేగంబజార్‌లో వ్యాపారం నిర్వహించే ఆయనకు వైరస్‌ ఉన్నట్టు నిర్ధారించారు. నేరేడ్‌మెట్‌లోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. వనస్థలిపురం, కాప్రా సర్కిల్‌ పరిధిలోనూ ఇటీవల కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా నమోదవుతున్న కేసుల్లో మెజారిటీ కొత్త ప్రాంతాల్లోవి కావడం గమనార్హం. దీంతో ఆయా ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి ఎలా ఉందన్నది గుర్తించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇంతకుముందులానే కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇంటి చుట్టుపక్కల ఉండే 20 నుంచి 100 ఇళ్ల వరకు కట్టడి ప్రాంతంగా గుర్తించి నిర్బంధం అమలు చేస్తున్నారు.

ఆయా ప్రాంతాల్లో కేసుల తీవ్రత ఎలా ఉంటుందన్నది ఈ వారంలో తేలుతుందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల నమోదవుతున్న కేసుల్లో వ్యాపారులు, ప్రజలతో కలిసే వారు ఉండడం ఆందోళన కలిగిస్తోందని ఉన్నతాధికారొకరు తెలిపారు. కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో కొందరు సాధారణంగానే బయట తిరుగుతున్నారు. వీరి నుంచి వైరస్‌ ఇతరులకు సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్వారంటైన్‌ 28 రోజులకు పెంచినప్పటికీ చాలా ప్రాంతాల్లో ఇది పకడ్బందీగా అమలు కావడం లేదు. తొలగించిన కట్టడి ప్రాంతాల్లోనూ తదుపరి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ … అమెజాన్ లో 50 వేల ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ... అమెజాన్ లో 50 వేల ఉద్యోగాలు కరోనా కారణంగా నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇంకా కొన్ని కంపెనీలు తొలగించే అవకాశం లేకపోలేదు. స్టార్టప్‌ కంపెనీల నుంచి దిగ్గజ...

బావిలో శవమై తేలిన వలస కుటుంబం

విషాదం.. బావిలో శవమై తేలిన వలస కుటుంబం పొట్టకూటి కోసం వచ్చిన ఓ వలస కుటుంబం అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై తేలింది. ఈ ఘటన వరంగల్‌ జిల్లాలో కలకలం రేపింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన...

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 90 శాతం వేతనాలు

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 90 శాతం వేతనాలు ఏప్రిల్‌ నెల జీతాలపై ఏపీఎస్‌ఆర్టీసీ ఆదేశాలు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో విధులు నిర్వహిస్తున్న 7,600 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలను...

మారటోరియం పెంపు.. వడ్డీ రేట్ల తగ్గింపు.. ఆర్బీఐ భారీ ఊరట

మారటోరియం పెంపు.. వడ్డీ రేట్ల తగ్గింపు.. ఆర్బీఐ భారీ ఊరట లాక్ డౌన్ పొడిగింపుతో రిజర్వుబ్యాంకు మరో నిర్ణయం తీసుకుంది. మారటోరియంను మరో మూడునెలలు పెంచింది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకూ...

Latest

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!!

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!! ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్.. మాన‌వ మ‌నుగ‌డ‌కే స‌వాల్ విసురుతోంది. మొద‌ట చైనాలో ప్రారంభ‌మైన ఈ మ‌హ‌మ్మారి దండ‌యాత్ర ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. మ‌రోవైపు ఈ...

ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ వేయించలేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు …!

ప్రతి చిన్న కారణానికి యువతీ, యువకులు ఆవేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫోన్ కొనివ్వలేదని, పెట్రోల్ పోయించ లేదని పనికమలిన కారణాలతో వారి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నేటి యువత. ఇలాంటి సంఘటనలు...

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...