14.6 C
New York
Monday, May 25, 2020
Home News ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య

ఇద్దరు బిడ్డలను చంపి… తానూ ఆత్మ హత్య చేసుకున్న తల్లి ఉదంతం పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికు లు, పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు.. మండలంలోని తుమ్మలచెరువు గ్రా మానికి చెందిన గన్నారపు రంగారెడ్డి కుమార్తె రాధికకు వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన జూలకంటి వెంకటరెడ్డి, నాగమ్మల రెండో కుమారుడు లచ్చిరెడ్డితో 2013లో వివాహమైంది. వ్యాపారం కోసం లచ్చిరెడ్డి, ఆయన సోదరుడు నారాయణరెడ్డి కుటుంబాలు కలిసి హైదరాబాద్‌లోని కేబీసీ కాలనీలో జీవనం సాగిస్తున్నాయి. అయితే ఏప్రిల్‌ 14న నారాయణరెడ్డి, హర్షితల కుమార్తె లిసిక (3) మరుగుదొడ్లు శుభ్రం చేసే ద్రావణం తాగి మరణించింది. కానీ లిసిక మరణానికి రాధిక కారణం అంటూ కుటుంబంలో కలహాలు మొదలయ్యా యి.

గురువా రం ఉదయం 11 గంటలకు రాధికను తుమ్మలచెరువు గ్రామంలో ఆమె తల్లి ఇంటి వద్ద విడిచి భర్త లచ్చిరెడ్డి హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. రాధిక (27) ఆ అపనిందను భరించలేక ఆదివారం తన ఇద్దరు పిల్లలు కృషిదీప్‌రెడ్డి (4), రిషిక (13 నెలలు)లను దిండుతో అదిమిపెట్టి చంపి తాను ఉరివేసుకొని మృతి చెందింది. రేషన్‌ తీసుకొచ్చేందుకు వెళ్లిన ఆమె తల్లి ఇంటికొచ్చి చూసేసరికి కుమార్తె ఉరివేసుకొని కనిపించింది. హర్షితకు చెప్పండి… నేను ఎలాంటి తప్పూ చేయలేదు నాన్నా.. అంటూ తన మరణానికి కారణం తెలియజేస్తూ రాసిన లేఖ ఆమె మృతదేహం వద్ద గుర్తించారు. సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి, సీఐ కె. ప్రభాకర్, ఎస్‌ఐ సుధీర్‌కుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య ఇద్దరు బిడ్డలను చంపి... తానూ ఆత్మ హత్య చేసుకున్న తల్లి ఉదంతం పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికు లు, పోలీసులు...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు కరోనా కేసుల సంఖ్య విషయంలో చైనాను ఇటీవలే అధిగమించిన భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఎన్నడూ లేనంతగా కేవలం ఒక్క రోజులో 4,987...

Latest

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...