14.6 C
New York
Saturday, May 30, 2020
Home News ఉమ్మడి ప్రవేశపరీక్షల ఫీజులకు ఆఖరి గడువు ఇదే!

ఉమ్మడి ప్రవేశపరీక్షల ఫీజులకు ఆఖరి గడువు ఇదే!

ఉమ్మడి ప్రవేశపరీక్షల ఫీజులకు ఆఖరి గడువు ఇదే!

ఏపీలో వివిధ ఉమ్మడి ప్రవేశపరీక్షల తేదీలు కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా ఆయా పరీక్షల తేదీలను ప్రకటించింది ప్రభుత్వం. ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌)కు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ, ఫీజు చెల్లింపులకు సంబంధించిన రివైజ్డ్‌ షెడ్యూల్‌ను ఏపీ ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. కరోనా వైరస్ విస్తృతి కారణంగా ఈ ఏడాది అకడమిక్ ఇయర్, సాధారణ పబ్లిక్ పరీక్షలకు అంతరాయం ఏర్పడింది.అన్ని ‘సెట్స్‌’కు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తులు సమర్పించే గడువును జూన్‌ 15 వరకు పొడిగించినట్లు మండలి కార్యదర్శి బి.సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసెట్‌: రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.500 చెల్లించాలి. రూ.500 ఆలస్య రుసుంతో జూన్‌ 30, రూ.1000 ఆలస్య రుసుంతో జూలై 9, రూ.5000 ఆలస్య రుసుంతో జూలై 17, రూ.10 వేల ఆలస్య రుసుంతో జూలై 23 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈసెట్‌: ఫీజు రూ.550, రూ.1000 ఆలస్య రుసుంతో జూలై 16 వరకు ఐసెట్‌: రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.550, రూ.2000 ఆలస్య రుసుంతో జూన్‌ 30, రూ.5000తో జూలై 11, రూ.10 వేలతో జూలై 18. పీజీఈసెట్‌: రిజిస్ర్టేషన్‌ ఫీజు రూ.1000, ఎస్సీ/ఎస్టీలు రూ.500… రూ.500 ఆలస్య రుసుంతో జూలై 5, రూ.1000తో జూలై 16, రూ.2000 ఆలస్య రుసుంతో జూలై 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

ఎడ్‌సెట్‌: రిజిస్ర్టేషన్‌ ఫీజు రూ.600, ఎస్సీ/ఎస్టీలురూ.400, రూ.500 ఆలస్య రుసుంతో జూలై 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. లాసెట్‌: రిజిస్ర్టేషన్‌ ఫీజు(లాసెట్‌) రూ.750, (పీజీఎల్‌సెట్‌) రూ.850 చెల్లించాలి. రూ.500 ఆలస్య రుసుంతో జూలై 7, రూ.1000 ఆలస్య రుసుం తో జూలై 16, రూ.2000తో జూలై 25 వరకు సమర్పించవచ్చు. పీఈసెట్‌: రిజిస్ర్టేషన్‌ ఫీజు(ఇతరులు) రూ.850, ఎస్సీ/ఎస్టీలు రూ.650 చెల్లించాలి.

రూ.500 ఆలస్య రుసుంతో జూలై 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. జేఇఇ మెయిన్స్ జేఈఈ-మెయిన్స్‌-2020 కోసం ఆన్‌లైన్‌ అప్లికేషన్లను ‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ (ఎన్‌టీఏ)’ రీ ఓపెన్‌ చేసింది. ఇప్పటి వరకు మెయిన్స్‌కు దరఖాస్తు చేయని వారు, అప్లికేషన్‌ పూర్తి చేయని వారు ఇప్పుడు ఆ ప్రక్రియను మొదలు పెట్టుకోవచ్చు. మంగళవారం నుంచి అప్లికేషన్లను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ నెల 24 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. ఫీజును 24 రాత్రి 11.50 గంటల వరకు చెల్లించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ … అమెజాన్ లో 50 వేల ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ... అమెజాన్ లో 50 వేల ఉద్యోగాలు కరోనా కారణంగా నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇంకా కొన్ని కంపెనీలు తొలగించే అవకాశం లేకపోలేదు. స్టార్టప్‌ కంపెనీల నుంచి దిగ్గజ...

బావిలో శవమై తేలిన వలస కుటుంబం

విషాదం.. బావిలో శవమై తేలిన వలస కుటుంబం పొట్టకూటి కోసం వచ్చిన ఓ వలస కుటుంబం అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై తేలింది. ఈ ఘటన వరంగల్‌ జిల్లాలో కలకలం రేపింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన...

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 90 శాతం వేతనాలు

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 90 శాతం వేతనాలు ఏప్రిల్‌ నెల జీతాలపై ఏపీఎస్‌ఆర్టీసీ ఆదేశాలు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో విధులు నిర్వహిస్తున్న 7,600 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలను...

మారటోరియం పెంపు.. వడ్డీ రేట్ల తగ్గింపు.. ఆర్బీఐ భారీ ఊరట

మారటోరియం పెంపు.. వడ్డీ రేట్ల తగ్గింపు.. ఆర్బీఐ భారీ ఊరట లాక్ డౌన్ పొడిగింపుతో రిజర్వుబ్యాంకు మరో నిర్ణయం తీసుకుంది. మారటోరియంను మరో మూడునెలలు పెంచింది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకూ...

Latest

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!!

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!! ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్.. మాన‌వ మ‌నుగ‌డ‌కే స‌వాల్ విసురుతోంది. మొద‌ట చైనాలో ప్రారంభ‌మైన ఈ మ‌హ‌మ్మారి దండ‌యాత్ర ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. మ‌రోవైపు ఈ...

ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ వేయించలేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు …!

ప్రతి చిన్న కారణానికి యువతీ, యువకులు ఆవేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫోన్ కొనివ్వలేదని, పెట్రోల్ పోయించ లేదని పనికమలిన కారణాలతో వారి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నేటి యువత. ఇలాంటి సంఘటనలు...

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...