14.6 C
New York
Monday, May 25, 2020
Home News పిల్లలు పస్తులుండటం చూడలేక ... తల్లి ఆత్మహత్య

పిల్లలు పస్తులుండటం చూడలేక … తల్లి ఆత్మహత్య

పిల్లలు పస్తులుండటం చూడలేక … తల్లి ఆత్మహత్య

లాక్‌డౌన్ వల్ల కరోనా కంట్రోల్ అవుతోందో లేదో గానీ… ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మాత్రం తీవ్ర కష్టాల్లోకి జారుకుంటున్నారు. తెలంగాణలో జరిగిన ఈ ఉదంతమే ప్రత్యక్ష నిదర్శనం. పరిగి పట్టణంలో 26 ఏళ్ల సరళ అనే యువతి, తన భర్త, ఇద్దరు పిల్లలతో ఉంటోంది. ఎంతో అన్యోన్యంగా బతికే కుటుంబంలో లాక్‌డౌన్ చిచ్చుపెట్టింది. భర్త నరసింహ ఓ ప్రైవేట్ కారు డ్రైవర్. లాక్‌డౌన్ నాటి నుంచి పని లేదు. దీంతో పూట గడవని పరిస్థితి. ఆమె నగలు అమ్మి కొద్దిరోజులు కాలం గడిపినా ప్రభుత్వాలు వరుసగాలాక్ డౌన్ పొడిగిస్తూ ప్రకటనలు చేయడంతో ఇక రోజులు గడిచే మార్గంలేదని, పిల్లలు పస్తులుండటం చూడలేక ఆ యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకొని… అంటించుకుంది. మంటలను తట్టుకోలేక అరుస్తూ వచ్చి ఇంటి గుమ్మం దగ్గర పడిపోయింది. షాకైన కుటుంబ సభ్యులకు ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. మంటల్ని ఆర్పేందుకు ఏవోవో ప్రయత్నాలు చేశారు. కానీ… అప్పటికే శరీరం మొత్తం కాలిపోయి…

సరళ ప్రాణాలు విడిచింది. చుటుపక్కల వాళ్లంతా వచ్చి… అయ్యో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సరళ కనీసం తమను అడిగినా ఎంతో కొంత సాయం చేసేవాళ్లం అంటూ విచారం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఘటనా స్థలానికి పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఇలా ఆర్థిక కష్టాలు ఆ కుటుంబాన్ని కన్నీటి సంద్రంలోకి నెట్టేశాయి.కరోనా లాక్‌డౌన్ మిగిల్చిన విషాదం ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య ఇద్దరు బిడ్డలను చంపి... తానూ ఆత్మ హత్య చేసుకున్న తల్లి ఉదంతం పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికు లు, పోలీసులు...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు కరోనా కేసుల సంఖ్య విషయంలో చైనాను ఇటీవలే అధిగమించిన భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఎన్నడూ లేనంతగా కేవలం ఒక్క రోజులో 4,987...

Latest

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...