14.6 C
New York
Monday, May 25, 2020
Home News ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ అనుమానంతో ఎంత పని చేసాడు..?

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ అనుమానంతో ఎంత పని చేసాడు..?

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ అనుమానంతో ఎంత పని చేసాడు..?

అనుమానం పెనుభూతం అంటూ చెబుతారు పెద్దలు. ఏ బంధంలో అయిన నమ్మకం అనేది ఎంతో ముఖ్యం.. ఒకసారి అనుమానం మొదలయింది అంటే అది పెనుభూతం లా పెరిగి పోతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది… ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏ కష్టం లేకుండా చూసుకుంటాను అన్నాడు. వారి దాంపత్య జీవితానికి ఆరేళ్లు గడిచిపోయింది… వారిద్దరి ప్రేమ కి ప్రతిరూపం కాగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ ఆ తర్వాత వారిద్దరి మధ్య అనుమానం పుట్టింది. దీంతో మద్యానికి బానిసైన భర్త రోజు భార్యను అనుమానంతో వేధించేవాడు.రోజురోజుకు అనుమానం పెరిగి పోవడంతో వారిని అతి కిరాతకంగా చంపేశారు.

ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… పిప్పర గ్రామానికి చెందిన బోయ నరేష్ అదే గ్రామానికి చెందిన వెంకటరమణ అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆరేళ్ల పాటు వీరి సంసార జీవితం ఎంతో సాఫీగా సాగిపోయింది. ఇక వీరిద్దరి ప్రేమకి గుర్తుగా పావని దుర్గా, హర్ష అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. కానీ ఇంతలో భర్త నరేష్ మద్యానికి బానిస అయిపోయాడు. ఈ క్రమంలోనే భార్యపై అనుమానం కూడా పెంచుకున్నాడు. ఏదోవిధంగా అనుమానిస్తూ భార్యను వేధిస్తూనే ఉండేవాడు. భార్యకు ఇతరులతో అక్రమ సంబంధాలు అంటగట్టి చిత్రహింసలకు గురి చేసే వాడు.

ఈ క్రమంలోనే సోమవారం కూడా ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు నరేష్. ఇంతలో భార్యతో గొడవపడి కోపోద్రిక్తుడై భార్య పై చేయి చేసుకున్నాడు.ఇక భర్త చేష్టలతో అలిగిన భార్య తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి పోయింది. దీంతో నరేష్ మరింత కోపంతో రగిలిపోయాడు.. ఇక ఆ తర్వాత రోజు మంగళవారం మధ్యాహ్నం మళ్లీ ఫుల్లుగా మద్యం తాగి అత్త వారి ఇంటికి వెళ్లి వారితో గొడవ పడ్డాడు. దీంతో భార్య భర్తల మధ్య తలెత్తిన వివాదం కాస్త చిలికిచిలికి గాలివానలా కావడంతో.. కోపోద్రిక్తుడు అయిన భర్త నరేష్ తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా భార్య పై దాడి చేసాడు . ఇక ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు మహిళను తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న నరేష్ నేరుగా గణపవరం పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయాడు. ఇక మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య ఇద్దరు బిడ్డలను చంపి... తానూ ఆత్మ హత్య చేసుకున్న తల్లి ఉదంతం పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికు లు, పోలీసులు...

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు కరోనా కేసుల సంఖ్య విషయంలో చైనాను ఇటీవలే అధిగమించిన భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఎన్నడూ లేనంతగా కేవలం ఒక్క రోజులో 4,987...

Latest

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...