14.6 C
New York
Monday, May 25, 2020
Home News భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు

కరోనా కేసుల సంఖ్య విషయంలో చైనాను ఇటీవలే అధిగమించిన భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఎన్నడూ లేనంతగా కేవలం ఒక్క రోజులో 4,987 పాజిటివ్‌ కేసులు.. ఏకంగా 120 మరణాలు. కరోనా పాజిటివ్‌ కేసులు 90 వేల మార్కును దాటేయడం గుబులు రేపుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు దేశంలో 4,987 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా ప్రభావం మొదలయ్యాక ఒక్కరోజులో ఇన్ని కేసులు బయటపడడం ఇదే మొదటిసారి. అయితే రికవరీ రేటు 37.51 శాతానికి పెరగడంతో కొంత ఊరట లభించింది. దేశంలో 8 రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కరోనా కేసులేవీ నమోదు కాకపోవడం గమనార్హం.గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 120 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. నిజంగా ఇది గుబులు రేపే సంఖ్యే. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 90,927కు, మరణాలు 2,872కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం యాక్టివ్‌కరోనా కేసులు 53,946 కాగా, 34,108 మంది బాధితులు చికిత్సతో కోలుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 37.51 శాతానికి పెరగడం కొంతలో కొంత ఊరట కలిగిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. మూడు రాష్ట్రాల్లో 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.

మహారాష్ట్రలో 30,706, గుజరాత్‌లో 10,988, తమిళనాడులో 10,585 పాజిటివ్‌ కేసులు బహిర్గతం అయ్యాయి. ఇప్పటిదాకా మొత్తం మరణాలు 2,872 కాగా, ఇందులో 1,135 మరణాలు కేవలం మహారాష్ట్రలో సంభవించాయి. గుజరాత్‌లో 625 మంది, మధ్యప్రదేశ్‌లో 243, పశ్చిమ బెంగాల్‌లో 232, ఢిల్లీలో 129, రాజస్తాన్‌లో 126, ఉత్తరప్రదేశ్‌లో 104, తమిళనాడులో 74 మంది కరోనా బారినపడి మృతి చెందారు. అధికమరణాలు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు లేకపోవడం సంతోషించదగిన విషయం.

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు రెట్టింపయ్యేందుకు ప్రస్తుతం 13.6 రోజుల సమయం పడుతోందని ఆరోగ్యశాఖ తెలి పింది. 14 రోజుల నుంచి 11.5 రోజులుగా ఉన్న ఈ గడువు గత మూడు రోజులుగా 13.6 రోజులకు చేరిందంది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో మరణాల సంఖ్య 3.1 శాతమని పేర్కొంది. దేశంలో 8 రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కరోనా కేసులేవీ నమోదు కాలేదని తెలిపింది. కరోనా కేసులు 106 రోజుల్లో 80 వేల మార్కును దాటాయని, అభివృద్ధి చెందిన యూకే, ఇటలీ, స్పెయిన్, జర్మనీ వంటి దేశాల్లో ఇందుకు 44-66 రోజుల సమయం పట్టిందని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య ఇద్దరు బిడ్డలను చంపి... తానూ ఆత్మ హత్య చేసుకున్న తల్లి ఉదంతం పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికు లు, పోలీసులు...

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు కరోనా కేసుల సంఖ్య విషయంలో చైనాను ఇటీవలే అధిగమించిన భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఎన్నడూ లేనంతగా కేవలం ఒక్క రోజులో 4,987...

Latest

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...