14.6 C
New York
Tuesday, May 26, 2020
Home News మైనర్‌ గర్భం తొలగింపుకు హైకోర్టు అనుమతి

మైనర్‌ గర్భం తొలగింపుకు హైకోర్టు అనుమతి

మైనర్‌ గర్భం తొలగింపుకు హైకోర్టు అనుమతి

ముంబై : అత్యాచారానికి గురైన ఓ మైనర్‌ బాలిక గర్భం తొలగించుకోవడానికి బాంబే హైకోర్టు అనుమతించింది. ప్రస్తుతం 24 వారాల గర్భిణిగా ఉన్న ఆ బాలిక తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. అయితే తీర్పుకు ముందు గర్భం తొలగింపు బాలికపై ఎలాంటి ప్రభావం చూపనుందనే అంశంపై వైద్య నిపుణల సలహా తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. వైద్యం ద్వారా తన బిడ్డ గర్భం తొలగించుకోవడానికి తక్షణమే అనుమతి ఇవ్వాలని సదురు బాలిక తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించింది.

గతేడాది జరిగిన అత్యాచారం కారణంగా తన బిడ్డ గర్భం దాల్చిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆమె మానసిక బాధలో ఉందని.. అందువల్ల గర్భం తొలగించడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇది తన బిడ్డ చదువుపై శ్రద్ధ పెట్టడానికి సహాకరిస్తుందని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై మే 15న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టిన న్యాయస్థానం.. గర్భం తొలగించడం ద్వారా బాలికకు ఏమైనా ఆరోగ్యపరమైన సమస్యల ఎదురవుతాయా అనే దానిపై నివేదిక ఇవ్వడానికి జేజే హాస్పిటల్‌కు చెందిన వైద్య నిపుణల బృందాన్ని ఏర్పాటు చేసింది. ( : ముంబైకు షాక్‌..’బెస్ట్‌’ సర్వీసులు బంద్ )

దీంతో అన్ని పరిశీలించిన వైద్య బృందం కోర్టుకు ఓ నివేదిక అందజేసింది. ’24 వారాల్లో గర్భం తొలగించడం అనేది ఆ బాలికకు ప్రమాదం కలిగిస్తుంది. మరోవైపు గర్భం కొనసాగింపు ఆమె శారీరక, మానసిక ఆరోగ్యంపై ఒత్తిడి కలిగిస్తుంది. అందుకే ఆమె తనకు నచ్చిన హాస్పిటల్‌లో గర్భం తొలగించుకోవాల్సిందిగా సూచిస్తున్నాం’ అని పేర్కొంది. ఈ నివేదికను పరిశీలించిన న్యాయస్థానం.. పిటిషనర్‌ విజ్ఞప్తి మేరకు బాలిక అబార్షన్‌కు అనుమతినిచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...

Latest