14.6 C
New York
Monday, May 25, 2020
Home News రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

తెలంగాణలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి సీఎం కేసీఆర్‌ మార్చి 22న లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే తాజాగా హైదరాబాద్‌ మినహా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నడపడానికి ప్రభుత్వం అనుమతిండంతో 57 రోజుల తర్వాత బస్సులు రోడ్డెక్కుతున్నాయి. సూర్యాపేట డిపో నుంచి 78 బస్సులను ఆర్టీసీ నడుపుతున్నది. 54 సీటింగ్‌ కెపాసిటీతో ప్రయాణికులను తీసుకువెళ్లాలని డ్రైవర్‌ కండక్టర్లకు సూచించారు. శ్రీశైలం మినహా అన్ని రూట్లలో బస్సులు నడపాలని డిపో అధికారులు నిర్ణయించారు. నల్లగొండ రీజియన్‌లో 400 బస్సులు రోడ్డెక్కాయి. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం నుంచి వచ్చే బస్సులు హయత్‌నగర్‌ వరకు రానున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని తొమ్మిది డిపోల నుంచి 761 బస్సులు రోడ్డెక్కనున్నాయి. మహబూబ్‌ నగర్‌ డిపో బస్సులు ఆరాంఘర్‌ వరకు రానున్నాయి. కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్‌ డిపోల బస్సులు పహాడీషరీఫ్‌ వరకు వస్తాయి. అంతర్రాష్ట్ర బస్సులు నడపడానికి అనుమతి లేకపోవడంతో ఆ సర్వీసులను ఇతర రూట్లలో తిప్పాలని అధికారులు నిర్ణయించారు. అయితే అంతర్రాష్ట్ర రూట్లలో రద్దీని బట్టి రాష్ట్ర సరిహద్దు చివరి బస్టాండ్‌ వరకు బస్సులు నడపనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య ఇద్దరు బిడ్డలను చంపి... తానూ ఆత్మ హత్య చేసుకున్న తల్లి ఉదంతం పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికు లు, పోలీసులు...

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు కరోనా కేసుల సంఖ్య విషయంలో చైనాను ఇటీవలే అధిగమించిన భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఎన్నడూ లేనంతగా కేవలం ఒక్క రోజులో 4,987...

బావిలో శవమై తేలిన వలస కుటుంబం

విషాదం.. బావిలో శవమై తేలిన వలస కుటుంబం పొట్టకూటి కోసం వచ్చిన ఓ వలస కుటుంబం అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై తేలింది. ఈ ఘటన వరంగల్‌ జిల్లాలో కలకలం రేపింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన...

మియా మాల్కోవా తర్వాత బెస్ట్ బాడీ ఇదే: ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌పై ఆర్జీవీ హాట్ కామెంట్స్

మియా మాల్కోవా తర్వాత బెస్ట్ బాడీ ఇదే: ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌పై ఆర్జీవీ హాట్ కామెంట్స్ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన చిత్రాలకు బ్రాండ్ అంబాసీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ....

Latest

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...

25 నుంచి భక్తులకు శ్రీవారి లడ్డూలు

25 నుంచి భక్తులకు శ్రీవారి లడ్డూలు 13 జిల్లాల్లోని టీటీడీ కల్యాణ మండపాల్లో అందుబాటులోకి సగం ధరకే విక్రయం తిరుమల: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలోని 13 జిల్లా...