14.6 C
New York
Friday, May 29, 2020
Home News లాక్డౌన్ 4.0 మార్గదర్శకాలు విడుదల

లాక్డౌన్ 4.0 మార్గదర్శకాలు విడుదల

లాక్డౌన్ 4.0 మార్గదర్శకాలు విడుదల

హైదరాబాద్ : లాక్‌డౌన్ పొడిగింపుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేంద్రం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. మే 31 వరకూ మెట్రో, విమాన సేవలు అందుబాటులో ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా హాట్‌స్పాట్స్‌లో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది.
పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు మే 31 వరకూ మూసివేసే ఉంటాయని స్పష్టం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు మే 31 వరకూ తెరిచేందుకు అనుమతి లేదని కేంద్రం తేల్చి చెప్పింది. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, జిమ్ సెంటర్లు, స్విమింగ్ పూల్స్, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు మే 31 వరకూ తెరిచే పరిస్థితి లేదని కేంద్రం ప్రకటించింది. మే 31 వరకూ.. ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది.
ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య సమన్వయంతో అంతర్రాష్ట్ర రవాణా జరుపుకోవచ్చు.
రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఆయా ప్రభుత్వాల నిర్ణయం ఆధారంగా రవాణా సేవలు నిర్వహించుకోవచ్చు.
– అన్ని రాష్ట్రాలు సరుకు రవాణా వాహనాలను అనుమతించాలి.
– కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కేవలం నిత్యావసరాల కోసమే అనుమతులు ఉంటాయి.
– సినిమా హాళ్లు, మ్యూజియంలు, షాపింగ్ మాల్స్, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, వినోద కేంద్రాలు, పార్కులు, డ్రామా థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశ స్థలాలపై నిషేధం కొనసాగుతుంది.
– సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, మత, అన్ని రకాల వేడుకలు, గుమికూడడాలపై నిషేధం అమల్లో ఉంటుంది.
– క్రీడా సముదాయాలు, స్టేడియంలను ప్రేక్షకులను అనుమతించకుండా తెరుచుకోవచ్చు.
– అన్ని మతపరమైన ప్రదేశాలు, ప్రార్థనామందిరాలు మూసివేయాల్సిందే. మతపరమైన కార్యక్రమాల కోసం గుమికూడడం నియమోల్లంఘన కిందకు వస్తుంది.
– రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కఠినమైన రీతిలో కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
– దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేయడం వీలుకాదు. అయితే ఎయిర్ అంబులెన్స్ సేవలు, భద్రతా పరమైన కారణాల కోసం, అత్యవసర వైద్య సేవల కోసం, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతితో విమాన ప్రయాణాలు చేయవచ్చు.
– మెట్రో రైళ్లపై నిషేధం కొనసాగుతుంది.
– స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేత కొనసాగుతుంది.
– ఆన్ లైన్ విద్యాబోధన, దూరవిద్య బోధన కొనసాగించవచ్చు.
– హోటళ్లు, రెస్టారెంట్ల మూసివేత కొనసాగుతుంది. అయితే హోటళ్లను, లాడ్జీలను వైద్య, ఆరోగ్య, పోలీసు సిబ్బందికి కేటాయించినట్టయితే వాటిని తెరవొచ్చు.
– బస్ డిపోలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో ఉండే క్యాంటీన్లకు అనుమతి.
– ఆహార పదార్థాలు హోమ్ డెలివరీ చేసేందుకు రెస్టారెంట్లకు అనుమతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

బావిలో శవమై తేలిన వలస కుటుంబం

విషాదం.. బావిలో శవమై తేలిన వలస కుటుంబం పొట్టకూటి కోసం వచ్చిన ఓ వలస కుటుంబం అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై తేలింది. ఈ ఘటన వరంగల్‌ జిల్లాలో కలకలం రేపింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన...

Suffering from joint pain? Swami Ramdev will help you cure it with home remedies and yoga asanas

Suffering from joint pain? Swami Ramdev will help you cure it with home remedies and yoga asanas Swami Ramdev will help you cure joint pain...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ … అమెజాన్ లో 50 వేల ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ... అమెజాన్ లో 50 వేల ఉద్యోగాలు కరోనా కారణంగా నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇంకా కొన్ని కంపెనీలు తొలగించే అవకాశం లేకపోలేదు. స్టార్టప్‌ కంపెనీల నుంచి దిగ్గజ...

మారటోరియం పెంపు.. వడ్డీ రేట్ల తగ్గింపు.. ఆర్బీఐ భారీ ఊరట

మారటోరియం పెంపు.. వడ్డీ రేట్ల తగ్గింపు.. ఆర్బీఐ భారీ ఊరట లాక్ డౌన్ పొడిగింపుతో రిజర్వుబ్యాంకు మరో నిర్ణయం తీసుకుంది. మారటోరియంను మరో మూడునెలలు పెంచింది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకూ...

Latest

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!!

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!! ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్.. మాన‌వ మ‌నుగ‌డ‌కే స‌వాల్ విసురుతోంది. మొద‌ట చైనాలో ప్రారంభ‌మైన ఈ మ‌హ‌మ్మారి దండ‌యాత్ర ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. మ‌రోవైపు ఈ...

ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ వేయించలేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు …!

ప్రతి చిన్న కారణానికి యువతీ, యువకులు ఆవేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫోన్ కొనివ్వలేదని, పెట్రోల్ పోయించ లేదని పనికమలిన కారణాలతో వారి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నేటి యువత. ఇలాంటి సంఘటనలు...

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...