14.6 C
New York
Monday, May 25, 2020
Home News సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

వలస కార్మికుడిపై కేసు నమోదు

ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు నిలువరించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు అనంతపురం జిల్లా ధర్మవరం అర్బన్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు. ధర్మవరం పరిసరాల్లోని వలస కార్మికులను శుక్రవారం అనంతపురం రైల్వే స్టేషన్‌ నుంచి శ్రామికరైలులో బెంగళూరు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీరిని రైల్వేస్టేషన్‌కు తీసుకెళుతున్న ధర్మవరం ఆర్టీసీ డిపో బస్సు (ఏపీ02జెడ్‌ 0552)ను అధికారులు మధ్యలోనే వెనక్కు రప్పించారు.

కార్మికుల కోసం మరో బస్సు పంపించారు. దీంతో మధ్యలోనే కార్మికులు బస్సు దిగేశారు. కర్ణాటక రాష్ట్రం విజయపుర గ్రామానికి చెందిన ముజామిల్‌ఖాన్‌ మద్యం మత్తులో బస్సు వెనక సీట్లో నిద్రపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో అతడు ఆ బస్సులోనే ధర్మవరం ఆర్టీసీ గ్యారేజికి వచ్చేశాడు. కొద్దిసేపటికి మెలకువ వచ్చిన అతడు బస్సు ఇంజన్‌ తాళంచెవి కూడా అక్కడే ఉండటంతో స్టార్ట్‌చేసి బయటకు తీసుకొచ్చేశాడు. బస్టాండ్‌ బయట ఉన్న డ్రైవర్‌ వెంకటేశ్‌ గమనించి డిపో మేనేజరు మల్లికార్జునకు, డయల్‌ 100కు ఫోన్‌చేసి చెప్పి బైక్‌పై బస్సును వెంబడించారు. బస్సు పెనుకొండ హైవేలో వెళ్తుండగా కియా ఇండస్ట్రియల్‌ ఏరియా పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ గణేష్, చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐ రమేష్‌ రోడ్డుకు అడ్డంగా లారీ కంటైనర్‌ను పెట్టి బస్సును ఆపి ముజామిల్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు బస్సును ధర్మవరం అర్బన్‌ పోలీసులకు అప్పగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య ఇద్దరు బిడ్డలను చంపి... తానూ ఆత్మ హత్య చేసుకున్న తల్లి ఉదంతం పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికు లు, పోలీసులు...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ … అమెజాన్ లో 50 వేల ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ... అమెజాన్ లో 50 వేల ఉద్యోగాలు కరోనా కారణంగా నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇంకా కొన్ని కంపెనీలు తొలగించే అవకాశం లేకపోలేదు. స్టార్టప్‌ కంపెనీల నుంచి దిగ్గజ...

బావిలో శవమై తేలిన వలస కుటుంబం

విషాదం.. బావిలో శవమై తేలిన వలస కుటుంబం పొట్టకూటి కోసం వచ్చిన ఓ వలస కుటుంబం అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై తేలింది. ఈ ఘటన వరంగల్‌ జిల్లాలో కలకలం రేపింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన...

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 90 శాతం వేతనాలు

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 90 శాతం వేతనాలు ఏప్రిల్‌ నెల జీతాలపై ఏపీఎస్‌ఆర్టీసీ ఆదేశాలు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో విధులు నిర్వహిస్తున్న 7,600 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలను...

Latest

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...

25 నుంచి భక్తులకు శ్రీవారి లడ్డూలు

25 నుంచి భక్తులకు శ్రీవారి లడ్డూలు 13 జిల్లాల్లోని టీటీడీ కల్యాణ మండపాల్లో అందుబాటులోకి సగం ధరకే విక్రయం తిరుమల: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలోని 13 జిల్లా...

హైదరాబాద్‌లో ఉన్నారా…ఈ కొత్త గుడ్ న్యూస్ తెలుసుకోండి

హైదరాబాద్‌లో ఉన్నారా...ఈ కొత్త గుడ్ న్యూస్ తెలుసుకోండి దేశంలోని ఐదు మెట్రో నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అనేక ప్రత్యేకతలను తన సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అభివృద్ధి, విభిన్నతలు, వినూత్న సేవలు ఇలా అన్నింటి...