14.6 C
New York
Friday, May 29, 2020
Home Blog

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!!

0

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్.. మాన‌వ మ‌నుగ‌డ‌కే స‌వాల్ విసురుతోంది. మొద‌ట చైనాలో ప్రారంభ‌మైన ఈ మ‌హ‌మ్మారి దండ‌యాత్ర ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. మ‌రోవైపు ఈ మ‌హ‌మ్మారికి క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌పంచ‌దేశాలు విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు త‌గ్గ‌డం లేదు. ఇక క‌రోనా దెబ్బ అన్ని రంగాల‌పై పండింది. ఈ క్ర‌మంలోనే ఆర్థికంగా తీవ్ర దెబ్బ తిన్న సంస్థలు తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. అయితే ఇలాంటి స‌మ‌యంలోనే బీటెక్ అర్హ‌త‌తో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్-NLCIL 259 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ చేస్తోంది.

దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రాజెక్టుల్లో 259 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఈ సంస్థ. మొత్తం 259 ఖాళీలు ఉండగా అందులో మెకానికల్- 125, ఎలక్ట్రికల్ (ఈఈఈ)- 65, ఎలక్ట్రికల్ (ఈసీఈ)- 10, సివిల్- 5, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్- 15, కంప్యూటర్- 5, మైనింగ్- 5, జియాలజీ- 5, ఫైనాన్స్- 14, హ్యూమన్ రీసోర్స్- 10 పోస్టులున్నాయి. విద్యార్హత వివరాలు చూస్తే సంబంధిత బ్రాంచ్‌లో ఫుల్‌టైమ్ లేదా పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ 60% మార్కులతో పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులతో పాసైతే స‌రిపోతుంది.

అలాగే జియాలజీ పోస్టుకు ఎంటెక్ లేదా ఎంఎస్సీ, ఫైనాన్స్ పోస్టుకు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్ లేదా ఎంబీఏ, హ్యూమన్ రీసోర్స్ పోస్టుకు సోషల్ వర్క్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌తో డిగ్రీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ https://www.nlcindia.com/ లో తెలుసుకోవ‌చ్చు. ఆన్‌లైన్ ఎగ్జామ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఎప్పుడు ప్రారంభ‌మైంది. 2020 మే 30 ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది. అంటే మ‌రో నాలుగు రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ వేయించలేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు …!

0

ప్రతి చిన్న కారణానికి యువతీ, యువకులు ఆవేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫోన్ కొనివ్వలేదని, పెట్రోల్ పోయించ లేదని పనికమలిన కారణాలతో వారి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నేటి యువత. ఇలాంటి సంఘటనలు రోజురోజుకు బాగా పెరిగిపోతున్నాయి. ఇటీవల సెల్ ఫోన్ బ్యాలెన్స్ చేయించలేదు అని కోపంతో యువకుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని అయిన భోపాల్ లో చోటు చేసుకోవడం జరిగింది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… భూపాల్ కు చెందిన ఒక యువకుడు కొద్దిరోజులుగా సెల్ ఫోన్ లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ వేయించాలని తల్లిదండ్రులు అడగడం జరిగింది. ఇక తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఆ యువకుడు మనస్థాపానికి గురి అవ్వడం జరిగింది. దీనితో ఆవేశంగా ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో తల్లిదండ్రులకు తీరని బాధను మిగిల్చి వెళ్ళిపోయాడు. ఈ చిన్న విషయానికి కొడుకు ఆత్మహత్య చేసుకోవడం ఆ తల్లిదండ్రులకు పెద్ద షాక్ నే ఇచ్చింది.

ఈ సంఘటన విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. ఇది ఇలా ఉండగా బాగ్సేవానియా పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ తెలిపిన వివరాల ప్రకారం.. నెట్ బ్యాలెన్స్ వేయించాలని ఆ యువకుడు తన తల్లిని చాలా సార్లు అడిగినా కూడా ఆమె వేయించుకోపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది అని పోలీస్ అధికారులు తెలియజేశారు. ఏది ఏమైనా కానీ ఇలాంటి చిన్న చిన్న కారణాలతో నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం చాలా దారుణం అనే చెప్పాలి. దీనివల్ల కుటుంబ సభ్యులు ఎంత నష్ట పోతారు అన్న విషయం ఒకసారి గ్రహిస్తే ఇలాంటి ఆలోచనలు మనుకుంటారు. యువత ఒకసారి తల్లిదండ్రులు ఎందుకు చెబుతున్నారు అని ఆలోచిస్తే ఇలాంటి సంఘటనలు చాలా వరకు తగ్గుతాయి.

ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ వేయించలేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు …!

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

0

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్ చేశారని టాక్. అయితే ఆ అమ్మాయి ఎవరు?

లాక్‌డౌన్ ఏమో గానీ ఈ టైమ్‌లో సెలబ్రిటీల పెళ్లి ముచ్చట్లు హోరెత్తిస్తున్నాయి. ఎక్కువ ఖాళీ సమయం దొరకడంతో మన వెండితెర, బుల్లితెర బ్యాచిలర్స్ అంతా తమ తమ పెళ్లిపై దృష్టి సారించారు. మెల్లగా ఒక్కొక్కరూ పెళ్లికి సంబంధించిన పనులు చేసుకుంటూ మ్యారేజ్ డిసీజన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే నిఖిల్ ఓ ఇంటివాడు కాగా.. అదే లైన్‌లో నితిన్ ఉన్నాడు. ఇకపోతే సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ పెళ్లి దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఇదిలా ఉంటే బుల్లితెర కింగ్
సుడిగాలి సుధీర్ కూడా అదే బాటలో వెళ్తున్నాడని లేటెస్ట్ సమాచారం.

జబర్దస్త్ కమెడియన్‌గా భారీ పాపులారిటీ సంపాదించిన సుడిగాలి సుధీర్ పెళ్లి మ్యాటర్ గురించి ఎప్పటినుంచో వార్తలు వింటున్నాం. మూడు పదుల వయసు దాటడం పైగా, బుల్లితెరపై ప్లే బాయ్ ఇమేజ్ సొంతం చేసుకోవడంతో మనోడి పెళ్లి ముచ్చటనగానే అదో హాట్ ఇష్యూగా మారుతోంది. అంతకుముందు తోటి యాంకర్ రష్మీతో ప్రేమాయణం సాగిస్తున్నాడని, రష్మీ- సుధీర్ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఎన్నో వార్తలు విన్నాం. కానీ వాటిని ఆ ఇద్దరూ ఖండించడంతో ఫుల్‌స్టాప్ పడింది.

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ లాక్‌డౌన్ సమయమంతా తన పెళ్లి పైనే ఫోకస్ పెట్టాడట జబర్దస్త్ కుర్రోడు సుడిగాలి సుధీర్. అమ్మాయి వేట ప్రారంభించిన ఆయన.. చివరకు ఓ అమ్మాయితో కమిట్ అయ్యాడని తెలుస్తోంది. పెద్దలు చూసిన ఈ సంబంధం సుధీర్‌కి బాగా నచ్చేయడంతో ఓకే అనేశాడని తెలుస్తోంది. ఆ అమ్మాయి కృష్ణా జిల్లాకు చెందిన యువతి అని, దాదాపు పరిచయాలు అయిపోయాయని త్వరలో నిశ్చితార్థంతో ఇరు కుటుంబాలు అఫీషియల్‌గా పెళ్లి పనులు మొదలు పెట్టనున్నారని టాక్.

జబర్దస్త్ వేదికపై పొట్ట చెక్కలయ్యే కామెడీ పండించే సుడిగాలి సుధీర్ అంచెలంచెలుగా ఎదిగి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడగట్టుకున్నాడు. యాంకర్ గా పలు కార్యక్రమాల్లో అలరించాడు. ఇటీవలే హీరోగా కూడా వెండితెరపై కాలుమోపి ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ మూవీ ఆశించిన ఫలితం రాబట్టలేదు.

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

0

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న భూతం కరోనా వైరస్. ఈ వైరస్ రోజు రోజుకి చాప కింద నీరులా విస్తరిస్తుంది. లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా వైరస్ కేసులు దేశంలో పెరుగుతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ సామజిక దూరం పాటించాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అంటూ వ్యాధి. కాబట్టి ప్రతి ఒక్కరూ సామజిక దూరం పాటించాలి. అయితే బయట వాళ్ళతో పాటించగలరు కానీ ఇంట్లో వారితో కష్టం. ఎందుకంటే, ఇంట్లో అంతా ఒక దగ్గరే ఉంటారు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో దూరం పాటించడం కష్టం. ఎందుకంటే ప్రతి రాత్రి వారితోనే పక్కని పంచుకోవాలి కాబట్టి.. అందుకే అనేకమంది భార్యాభర్తల్లో కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వారిలో కలుగుతున్న భయాలకు సమాధానం దొరకట్లేదు. ఆ అనేక ప్రశ్నల్లో ఒకటి సెక్స్ లో పాల్గోనడం. కరోనావైరస్ సమయంలో సెక్స్ చేయొచ్చా? కరోనా వైరస్ సెక్స్ చేయడం ద్వారా వ్యాపిస్తుందా? ఈ సమయంలో సురక్షితమైన సెక్స్‌లో ఎలా పాల్గొనాలి. చాలా మంది మనసులో ఉన్న ప్రశ్న అది. మీకు ఆ డౌట్ ఉందా.. అయితే నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి..

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

0

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని ప్రకటన చేసింది. ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు పాస్‌లు లేకుండా తిరగొచ్చని చెబుతోంది. పోలీస్ శాఖ నుంచి నిన్న ఈ మేరకు ప్రకటన విడుదలైంది. పొరుగు జిల్లాలకు వెళ్లేందుకు ఎక్కువమంది సోషల్ మీడియా ద్వారా అభ్యర్థిస్తూ ఉండటంతో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే పాస్‌లు లేకపోయినా కొన్ని షరతులు మాత్రం వర్తిస్తాయని పోలీస్ శాఖ చెబుతోంది. కార్లలో ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించాలని… మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. ఏవైనా అత్యవసర పనులు ఉంటే మాత్రమే బయటకు వెళ్లాలని చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

కంటైన్మెంట్ ప్రాంతాల్లో, రెడ్ జోన్లలోని ప్రాంతాల్లో నిబంధనలు కొనసాగుతాయని… ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఉంటుందని ఆ తర్వాత ఎవరైనా బయటకు వస్తే చర్యలు తప్పవని చెబుతున్నారు. ఏపీకి రావాలన్నా, ఇతర రాష్ట్రాలకు వెళ్లాలన్నా అనుమతి తప్పనిసరి అని వారు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలకు అత్యవసర వైద్య చికిత్స, కుటుంబంలో మరణం, సామాజిక పనులు, ప్రభుత్వ విధి నిర్వహణలాంటి అత్యవసర ప్రయాణాలకు పాస్‌లు మంజూరు చేయనున్నట్టు తెలిపారు.

ఆన్ లైన్ లో ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సమర్పించిన వివరాలను పోలీసులు ఆమోదిస్తే దరఖాస్తు చేసుకున్న వారి మొబైల్, మెయిల్ ఐడీకి వాహన అత్యవసర పాస్‌ను పంపిస్తామని చెబుతున్నారు. పాస్‌ల కోసం దరఖాస్తు చేయడానికి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ప్రయాణించేవారి వివరాలు. ప్రయాణించే వారి ఐడీ ప్రూఫ్స్, మెయిల్ ఐడీ, అవసరమైన సంబంధిత డాక్యుమెంట్లు, మొబైల్ నంబర్, వాహనానికి సంబంధించిన వివరాలు తప్పనిసరి అని సమాచారం.

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

0

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

వలస కార్మికుడిపై కేసు నమోదు

ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు నిలువరించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు అనంతపురం జిల్లా ధర్మవరం అర్బన్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు. ధర్మవరం పరిసరాల్లోని వలస కార్మికులను శుక్రవారం అనంతపురం రైల్వే స్టేషన్‌ నుంచి శ్రామికరైలులో బెంగళూరు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీరిని రైల్వేస్టేషన్‌కు తీసుకెళుతున్న ధర్మవరం ఆర్టీసీ డిపో బస్సు (ఏపీ02జెడ్‌ 0552)ను అధికారులు మధ్యలోనే వెనక్కు రప్పించారు.

కార్మికుల కోసం మరో బస్సు పంపించారు. దీంతో మధ్యలోనే కార్మికులు బస్సు దిగేశారు. కర్ణాటక రాష్ట్రం విజయపుర గ్రామానికి చెందిన ముజామిల్‌ఖాన్‌ మద్యం మత్తులో బస్సు వెనక సీట్లో నిద్రపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో అతడు ఆ బస్సులోనే ధర్మవరం ఆర్టీసీ గ్యారేజికి వచ్చేశాడు. కొద్దిసేపటికి మెలకువ వచ్చిన అతడు బస్సు ఇంజన్‌ తాళంచెవి కూడా అక్కడే ఉండటంతో స్టార్ట్‌చేసి బయటకు తీసుకొచ్చేశాడు. బస్టాండ్‌ బయట ఉన్న డ్రైవర్‌ వెంకటేశ్‌ గమనించి డిపో మేనేజరు మల్లికార్జునకు, డయల్‌ 100కు ఫోన్‌చేసి చెప్పి బైక్‌పై బస్సును వెంబడించారు. బస్సు పెనుకొండ హైవేలో వెళ్తుండగా కియా ఇండస్ట్రియల్‌ ఏరియా పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ గణేష్, చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐ రమేష్‌ రోడ్డుకు అడ్డంగా లారీ కంటైనర్‌ను పెట్టి బస్సును ఆపి ముజామిల్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు బస్సును ధర్మవరం అర్బన్‌ పోలీసులకు అప్పగించారు.

25 నుంచి భక్తులకు శ్రీవారి లడ్డూలు

0

25 నుంచి భక్తులకు శ్రీవారి లడ్డూలు

13 జిల్లాల్లోని టీటీడీ కల్యాణ మండపాల్లో అందుబాటులోకి

సగం ధరకే విక్రయం

తిరుమల: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో గల టీటీడీ కల్యాణ మండపాల్లో అందుబాటులోకి రానుంది. కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడలోని టీటీడీ కల్యాణ మండపంలో లడ్డూలను అందుబాటులో ఉంచుతారు. లాక్‌డౌన్‌ ముగిసి తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులను దర్శనానికి అనుమతించేంత వరకు సగం ధరకే స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు చిన్న లడ్డూ ధరను రూ.50 నుంచి రూ.25కు తగ్గించారు. లడ్డూ ప్రసాదానికి సంబంధించిన సమాచారం కోసం టీటీడీ కాల్‌ సెంటర్‌ టోల్‌ ఫ్రీ నంబర్లు 18004254141 లేదా 1800425333333ను సంప్రదించవచ్చు.

ఎక్కువ మొత్తంలో కావాలంటే..
ఎక్కువ మొత్తంలో అనగా 1,000కి పైగా లడ్డూలు కొనుగోలు చేయదలిచిన భక్తులు తమ పేరు, పూర్తి చిరునామా, మొబైల్‌ నంబరు వివరాలను 5 రోజుల ముందుగా [email protected] అనే మెయిల్‌ ఐడీకి పంపాల్సి ఉంటుంది. వీరికి లభ్యతను బట్టి తిరుపతిలోని టీటీడీ లడ్డూ కౌంటర్‌ నుంచి గానీ, సంబంధిత జిల్లా కేంద్రాల్లోని టీటీడీ కల్యాణ మండపాల నుంచి గానీ లడ్డూలను అందజేస్తారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలోని టీటీడీ సమాచార కేంద్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి వచ్చిన అనంతరం లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతారు.

టీటీడీ ఆన్‌లైన్‌ సేవల వెబ్‌సైట్‌ మార్పు
తిరుపతి సెంట్రల్‌: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆర్జిత సేవలు, దర్శనం, బస, కల్యాణ మండపాలు తదితర ఆన్‌లైన్‌ సేవలను బుక్‌ చేసుకోవడంతో పాటు ఈ-హుండీ, ఈ-డొనేషన్‌లకు అందుబాటులో ఉన్న http:/ttdsevaonline.com వెబ్‌సైట్‌ను http:/tirupatibalaji.ap.gov.inగా మార్పు చేసినట్లు టీటీడీ ప్రజా సంబంధాల అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం (నేటి) నుంచి ఈ మార్పు అమల్లోకి రానుందని పేర్కొన్నారు. మార్పు చేసిన వెబ్‌సైట్‌ను భక్తులు వినియోగించుకోవాలని కోరారు.

హైదరాబాద్‌లో ఉన్నారా…ఈ కొత్త గుడ్ న్యూస్ తెలుసుకోండి

0

హైదరాబాద్‌లో ఉన్నారా…ఈ కొత్త గుడ్ న్యూస్ తెలుసుకోండి

దేశంలోని ఐదు మెట్రో నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అనేక ప్రత్యేకతలను తన సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అభివృద్ధి, విభిన్నతలు, వినూత్న సేవలు ఇలా అన్నింటి హైదరాబాద్ తన ప్రత్యేకతను నిలుపుకొంటోంది, తెలుగువారి ప్రత్యేకతను చాటి చెప్తోంది. అలాంటి హైదరాబాద్‌లో తాజాగా ఓ వినూత్నమైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ కీలక నిర్ణయం తీసుకుంది.

నగరంలో ఒక చోట నుంచి మరోచోటికి వస్తువులను రవాణా చేయడానికి ప్రజలు ఒక్కోసారి ఎంతో ఇబ్బంది పడుతుంటారు ఇప్పటికే పోస్టల్‌, కొరియర్ వంటి సేవలు ఉన్నప్పటికీ వాటిలోని కొన్ని సమస్యల ఆధారంగా అందరి అవసరాలు తీరడం లేదు. ఈ నేపథ్యంలో కనెక్ట్‌ పేరుతో ప్యాకేజీ సర్వీసులసు ఊబర్‌ మొదలుపెట్టింది. హైదరాబాద్‌, ఢిల్లీ, నోయిడా, చెన్నై, చండీగఢ్‌లలో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది.

ఉబర్‌ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రభుజీత్‌ సింగ్‌ ఈ సేవల గురించి వివరిస్తూ, ఐదు కిలోల కంటే తక్కువ బరువున్న ప్యాకేజీలను టూవీలర్‌ ద్వారా డెలివరీ ఇస్తామని తెలిపారు. నగరంలో ఒక చోట నుంచి మరోచోటికి వస్తువులను రవాణా చేయడానికి కనెక్ట్‌ సర్వీసు ఉపయోగపడుతుందని వెల్లడించారు. వినియోగదారుడు తన వస్తువును పంపించాక, ఉబర్‌ యాప్‌ ద్వారా దానిని ట్రాక్‌ చేసుకోవచ్చునని ప్రభుజిత్ సింగ్ ప్రకటించారు. డెలివరీ స్టేటస్‌ను షేర్‌ చేయొచ్చునని ఆయన వెల్లడించారు. ఉబర్‌ టెక్నాలజీ, నెట్‌వర్క్‌ ద్వారా సమర్థంగా సేవలు అందించగలుగుతున్నామని వివరించారు. కనెక్ట్‌ సేవలు అందించే సిబ్బందికి గవర్నమెంట్‌ రూల్స్‌పై ట్రైనింగ్‌ ఇప్పించామని స్పష్టం చేశారు. ప్రస్తుత కరోనా కలకలం నేపథ్యంలో, సోషల్‌ డిస్టెన్సింగ్‌ రూల్స్‌ను పాటిస్తూ వస్తువులను డెలివరీ ఇస్తున్నామని ప్రభుజీత్‌ సింగ్ స్పష్టం చేశారు. కోల్‌కతా, జైపూర్‌, గువాహటి, గుర్గావ్‌లో ఇది వరకే ప్యాకేజీ సర్వీసులను అందిస్తున్నామని, వాటికి మంచి స్పందన వస్తోందని ఉబర్‌ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు.

జనసేన కంటే ఎక్కువ ఫీల్ అవుతున్న టీడీపీ… అప్పుడు తెలియదా?

0

జనసేన కంటే ఎక్కువ ఫీల్ అవుతున్న టీడీపీ… అప్పుడు తెలియదా?

ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే బలం అన్న సంగతి తెలిసిందే. అందుకే తమ కోసం పోరాడుతున్న కార్యకర్తలకు పార్టీ నేతలు సపోర్ట్ ఉంటారు. అలాగే వారికి ప్రత్యర్ధి పార్టీ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురైన అండగా ఉండి, పోరాడే ప్రయత్నం చేస్తారు. అయితే ఇటీవల తమ కార్యకర్తలని వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని, టీడీపీ, జనసేన నేతలు నెత్తి నోరు బాదుకుంటున్నాయి.

సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చాలు వారి మీద అక్రమ కేసులు బనాయించి హింసిస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో తమ మీద వైసీపీ కార్యకర్తలు అసభ్యకరంగా పోస్టులు పెట్టిన, వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, పోలీసులు వేధిస్తున్నారని రెండు రోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌లో పురుగుల మందు తాగి జనసేన కార్యకర్త లోకేష్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు పోలీసులు వేధించడం నియంతృత్వాన్ని తలపిస్తోందని లోకేష్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిన పోలీసు అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. ఇదంతా జనసేన-వైసీపీలకు సంబంధించిన సమస్య. అయితే ఇందులోకి టీడీపీ వచ్చి ఎక్కువ ఫీల్ అయిపోతుంది. చంద్రబాబు చెప్పడంతో లోకేష్‌ని టీడీపీ నేతలు కొమ్మారెడ్డి పట్టాభి, ముళ్ళపూడి బాపిరాజులు పరామర్శించారు. తప్పుడు కేసులు పెడితే ఊరుకోమని పార్టీలకతీతంగా లోకేష్‌కు అండగా ఉంటామని రెండు డైలాగులు వేశారు.

ఇక ఇక్కడ అర్ధం కానీ విషయం ఏంటంటే ఇప్పుడు ఇలా తమ కార్యకర్తలని, వేరే పార్టీ కార్యకర్తలని ఇబ్బంది పెడుతున్నారని వైసీపీపై ఫైర్ అయిపోతున్న టీడీపీ నేతలకు, గత అయిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడూ వైసీపీ, జనసేన కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు తెలియవా? అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. వైసీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టి ఎన్ని రకాలుగా హింసించారో అందరికీ తెలుసని, ఇప్పుడు కూడా ప్రభుత్వంపై విష ప్రచారం చేసిన వారిపైనే ఏపీ డీజీపీ చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నారు.

సీఎం జగన్ మరో కీలక నిర్ణయం…. కేసీఆర్ కు మొదలైన తలనొప్పులు…?

0

సీఎం జగన్ మరో కీలక నిర్ణయం…. కేసీఆర్ కు మొదలైన తలనొప్పులు…?

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు మే నెలకు పూర్తి జీతాలను చెల్లిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. గత రెండు నెలలుగా ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టిన జగన్ సర్కార్ ఈ నెల నుంచి పూర్తి జీతాలను చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక శాఖ, ట్రెజరీకు ఈ మేరకు ఆదేశాలు అందాయి.

ట్రెజరీ సాఫ్ట్ వేర్ లో ఈ మేరకు మార్పులు చేశారు. అయితే కోత విధించిన జీతాలను ఏపీ ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందనే విషయం తెలియాల్సి ఉంది. తాజాగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ప్రభావం తెలంగాణపై పడింది. తెలంగాణలో గత రెండు నెలల నుంచి ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నారు. జగన్ పూర్తి జీతాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా ఉద్యోగులు పూర్తి జీతాలను చెల్లించాలని కోరుతున్నారు.

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఇప్పటికే సీఎస్ సోమేష్ కుమార్ కు మే నెలకు పూర్తి జీతాలు చెల్లించాలని లేఖ రాసింది. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు క్రమంగా సడలిస్తున్నారని అందువల్ల ఈ నెలకు పూర్తి జీతాలు చెల్లించాలని జేఏసీ కోరింది. పూర్తి జీతాల చెల్లింపు విషయంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. ఈరోజు లేదా రేపు వేతనాలకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న ఏపీలో 62 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2514కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 55 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. మరోవైపు తెలంగాణలో కూడా నిన్న 62 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1761కు చేరింది. రాష్ట్రంలో నిన్న ముగ్గురు మృతి చెందగా మృతుల సంఖ్య 48కు చేరింది.

MOST POPULAR